12న రానున్న మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు

Spread the love

అంచనాలు పెంచేలా చేసిన ద‌ర్శ‌కుడు

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. త‌ను తీసిన ప్ర‌తి మూవీ బిగ్ హిట్. విక్ట‌రీ వెంక‌టేశ్, మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ ల‌తో తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం భారీ స‌క్సెస్ సాధించింది. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు ద‌ర్శ‌కుడు. మెగాస్టార్ చిరంజీవితో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీని కంప్లీట్ చేశాడు. ఇందులో మ‌రో కీల‌క పాత్ర పోషించింది న‌య‌న‌తార‌. ఇక సినిమా ట్రైల‌ర్ , సాంగ్స్ కు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. టాప్ లో కొన‌సాగుతున్నాయి సాంగ్స్.

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాకు మ్యూజిక్ అందించి మ్యాజిక్ చేసిన సంగీత ద‌ర్శ‌కుడు తెలంగాణ‌కు చెందిన బీమ్స్ సిసిలిరియో తిరిగి అనిల్ రావిపూడి మెగాస్టార్ తాజా చిత్రానికి కూడా అందించ‌డం విశేషం. గ‌తంలో ద‌ర్శ‌కుడు త‌న ఎఫ్ 2, ఎఫ్ 3 సీక్వెల్ మూవీస్ కు దేవిశ్రీ ప్ర‌సాద్ ను తీసుకున్నాడు. కానీ కొత్త‌గా తాను తీసిన మూవీస్ కు త‌న‌ను మార్చేసి బీమ్స్ కు చాన్స్ ఇచ్చాడు. ఇది వ‌ర్క‌వుట్ అయ్యింది. సూప‌ర్ సాంగ్స్ కు స్వ‌ర‌క‌ల్ప‌న చేశాడు సంగీత ద‌ర్శ‌కుడు. తాజాగా మ‌నశంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. వ‌చ్చే జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించాడు. ఫ్యాన్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పాడు.

  • Related Posts

    మ‌న‌సు నొప్పిస్తే మ‌న్నించండి : శివాజీ

    Spread the love

    Spread the loveకావాల‌ని నేను వ‌స్త్ర‌ధార‌ణ‌పై మాట్లాడ‌లేదు హైద‌రాబాద్ : న‌టుడు శివాజీ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చాడు. తాను మ‌హిళ‌లు, ప్ర‌ధానంగా సినీ రంగానికి చెందిన హీరోయిన్ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. స్త్రీలు వ‌స్త్రాల‌ను నిండుగా క‌ట్టుకుంటేనే బాగుంటుంద‌ని…

    ధురంద‌ర్ సినిమా బాగుంద‌న్న శ్రుతి హాస‌న్

    Spread the love

    Spread the loveసోష‌ల్ మీడియా ట్రెండ్స్ పై షాకింగ్ కామెంట్స్ చెన్నై : ప్ర‌ముఖ న‌టి , ఇళ‌య నాయ‌గ‌న్, ఎంపీ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యురాలు శ్రుతి హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బుధ‌వారం త‌ను సామాజిక వేదిక ఎక్స్ లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *