టీటీడీ ఆల‌యాల్లో భారీ భ‌ద్ర‌త : ఎస్పీ

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం

తిరుప‌తి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల‌తో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో 24×7 నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామ‌న్నారు. నకిలీ టోకెన్లు జారీ చేసినా లేదా నకిలీ టోకెన్లతో వచ్చినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చ‌రించారు. భక్తులు ఎలాంటి మధ్యవర్తులు, అనధికార వ్యక్తులను నమ్మకుండా నకిలీ టోకెన్లను తీసుకుని మోసపోవద్దని సూచించారు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమలలో రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో, తిరుపతిలోని బస్టాండ్, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయడం జరిగిందన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమతి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం కోసం శ్రీ‌వారికి విన్న‌పం

    తిరుమ‌ల : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు త‌న భార్య అన్నా లెజ్ నోవా. ప‌వ‌న్ కు ఇటీవ‌లే ముంబైలో భుజానికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. మూడు వారాల పాటు విశ్రాంతి…

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *