అద్వానీకి పురస్కారం సంతోషం
స్పష్టం చేసిన పీఎం నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ అనుకోలేదని అద్వానీకి భారత రత్న తాను ప్రకటిస్తానని పేర్కొన్నారు. శనివారం సామాజిక వేదిక ట్విట్టర్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
భారతీయ జనతా పార్టీలో అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా, మార్గదర్శకుడిగా ఎల్కే అద్వానీ ఇప్పటికీ ఉన్నారని ప్రశంసలు కురిపించారు నరేంద్ర మోదీ. దేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం భారత రత్నను తీసుకోవడం అదృష్టంగా భావించక తప్పదన్నారు.
తాను ప్రకటించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మన కాలంలో అత్యంత విలువైన , స్పూర్తి దాయకమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు ఎల్కే అద్వానీ గుర్తుకు వస్తారని కొనియాడారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
భారత దేశ అభివృద్ధిలో కీలకమైన , ముఖ్యమైన, స్పూర్తి దాయకమైన పాత్ర పోషించిన అద్వానీ అర్హుడేనని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.