కావాలని నేను వస్త్రధారణపై మాట్లాడలేదు
హైదరాబాద్ : నటుడు శివాజీ ఎట్టకేలకు దిగి వచ్చాడు. తాను మహిళలు, ప్రధానంగా సినీ రంగానికి చెందిన హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. స్త్రీలు వస్త్రాలను నిండుగా కట్టుకుంటేనే బాగుంటుందని , కానీ ఎంతగా పల్చని దుస్తులు ధరిస్తే అంతగా పాపులర్ అవుతామని అనుకోవడం దారుణమమన్నారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యాడు శివాజీ. తను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఆపై సినీ రంగానికి చెందిన 100 మంది సినీ మహిళా ఆర్టిస్టులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు ఫిర్యాదు చేశారు శివాజీపై చర్యలు తీసుకోవాలని. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఫైర్ అయ్యారు. ఆపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు .
నటుడు శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదతో పాటు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. మహిళలు బట్టలు ధరించడం వారి ఇష్టానికే వదిలి వేయాలని, ఇలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఆపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేన్నారు నటుడు శివాజీ. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. బుధవారం నటుడు మీడియాతో మాట్లాడారు. తాను ఎవరిని ఈ డ్రెస్ వేసుకోండి, ఆ డ్రెస్ వేసుకోండి అని చెప్పలేదని అన్నారు. అయితే ఆ రెండు పదాలు ఎందుకు వచ్చాయో నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదన్నారు.






