కేబినెట్ లేకుండానే పాలించ లేదా
మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ కౌంటర్
హైదరాబాద్ – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. తమ పార్టీ గురించి, పాలన గురించి పదే పదే అవాకులు, చెవాకులు పేలుతున్న మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. పదేళ్లు పాలించినా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించింది.
కనీసం 50 రోజుల వరకు కేబినెట్ లేకుండానే పాలన సాగించిన సిగ్గు మాలిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించింది. ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతుంటే ఓర్చుకోలేక ఆధారాలు లేకుండా అభాండాలు వేయడం, ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని మండిపడింది కాంగ్రెస్ పార్టీ.
తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేసింది. అధికారం పోయిందన్న అక్కసుతో , అహంకారంతో ఇంకా లేని పోని విమర్శలు చేయడం మానుకోవాలని సూచించింది.