రిటర్నింగ్ ఆఫీసర్ పై సుప్రీం ఫైర్
ఇలాగేనా ప్రజాస్వామ్యం అంటే
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల నిర్వహణ అధికారి (రిటర్నింగ్ ఆఫీసర్ ) పై సీరియస్ కామెంట్స్ చేసింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు ఇలాగేనా ప్రవర్తించేది అంటూ సీరియస్ అయ్యింది.
బ్యాలెట్ పేపర్ ను సరి దిద్దడం, ఆ తర్వాత ఎవరూ లేరని అనుకుని చెత్త డబ్బాలో వేయడంపై మండిపడింది. బ్యాలెట్ ను పాడి చేస్తున్నదంతా రికార్డు అవుతుందని అనుకోక పోవడం దారుణమని పేర్కొంది. మీరు చూడక పోయినా సుప్రీంకోర్టు గమనిస్తుందని తెలుసుకుంటే మంచిదని హెచ్చరించింది. ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయడం సభ్య సమాజం చూస్తూ ఊరుకోదని పేర్కొంది సుప్రీంకోర్టు.
ఇదిలా ఉండగా చండీగఢ్ మేయర్ ఎన్నికల నిర్వహణపై ఆప్ కౌన్సిలర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నికల ఫలితాలపై స్టే ఇవ్వకుండా మూడు వారాల తర్వాత తన పిటిషన్ ను జాబితా చేయాలన్న హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.