టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

త‌యారు చేయాల‌న్న టీటీడీ ఈవో సింఘాల్

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్ త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌ర్చువ‌ల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని ప‌రిశీలించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా ఆలయ శిల్పాలు , చిత్రాలను మొబైల్ ఫోన్‌ల ద్వారా స్కాన్ చేసి, అధునాతన సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను భక్తులకు ప్రదర్శించాలని సూచించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆచారాలను ఎస్వీబీసీ ఛానెల్‌లో ప్రసారం చేస్తున్న తరహాలో, టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రత్యేకతను, ప్రాముఖ్యతను భక్తులకు తెలియ జేయడానికి అవసరమైతే, ఎస్వీ బీసీ కింద మరో ఛానెల్‌ను ప్రారంభించే సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఈవో ఆదేశించారు. ఈ ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి, అభివృద్ధి పనులపై నివేదికలను సిద్ధం చేయాల‌న్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, టీటీడీ ఆలయాలలో అన్నదానం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా, ప్రతి ఆలయానికి ఒక సాధారణ ఖాతా , అన్నదానం కోసం ప్రత్యేక ఖాతా ఉండాలని, ఈ రెండు ఖాతాలను ప్రత్యేక అధికారులు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్నప్రసాదం కోసం ఉన్న ప్రస్తుత ఖాతాలను కొనసాగించాలని స్ప‌ష్టం చేశారు సింఘాల్.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *