
9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
యుఏఈ : యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025లో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు యూఏఈకి చుక్కలు చూపించింది భారత్. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుల్దీప్ యాదవ్ , శివమ్ దూబే బౌలింగ్ తో బెంబేలెత్తించారు. ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. భారత్ టైటిల్ హాట్ ఫెవరేట్ గా ఉంది. ఎట్టకేలకు సంజూ శాంసన్ ను వికెట్ కీపర్ గా వాడుకున్నాడు హెడ్ కోచ్. జితేశ్ శర్మ 30 రన్స్ చేస్తే, గిల్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
జస్ ప్రీత్ బుమ్రా 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక కేరళ స్టార్ క్రికెటర్ శాంసన్ కళ్లు చెదిరేలా బంతిని ఒడిసి పట్టుకుని ఔరా అనిపించేలా చేశాడు. తను శివమ్ దూబే బౌలింగ్ లో ఫోర్ పోయే బాల్ ను అడ్డుకుని గాల్లో క్యాచ్ పట్టాడు. ఇక శాంసన్ ను ఓపెనర్ గా తీసుకుంటాడని భావించారు. కానీ ఎందుకనో గౌతమ్ గంభీర్ శుభ్ మన్ గిల్ , శర్మలను పంపించాడు. ఒకవేళ ప్రత్యర్థి జట్టు గనుక భారీ స్కోర్ చేస్తే ఇండియా తరపున మిడిల్ ఆర్డర్ లో శాంసన్ ను వాడుకునేలా ప్లాన్ చేసినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత సీజన్ లో ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత జట్టు.
ప్రస్తుతం ఈ టోర్నీలో కొత్త జట్లు కూడా పాల్గొనేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓకే చెప్పింది. మరో వైపు ఆఫ్గనిస్తాన్ జట్టు తొలి మ్యాచ్ లో బోణీ కొట్టింది. ఆ టీమ్ హాంకాంగ్ ను ఓడించింది.