దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్ర‌ద‌ర్శించాలి

ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్య‌త‌లు స్వీక‌రించాక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. గ‌తంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వేలాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యాన్ని క‌ల్పించారు . ఎస్వీబీసీ ఛాన‌ల్ లో నాణ్య‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల్లో మ‌రింత వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌న్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆల‌యాల్లో నిత్యం అన్న‌దానం కూడా పంపిణీ చేయ‌నున్న‌ట్లు స్ప‌స్టం చేశారు ఈవో.

ఇదిలా ఉండ‌గా దాత‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తిరుమ‌ల ఆల‌యంతో పాటు అదనంగా, స్థానిక, అనుబంధ ఆలయాలలో అన్న ప్రసాదాల పంపిణీకి విరాళాలు అందించే దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాలలో శ్రీ వేంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్య, వైద్య, న్యాయ, అటవీ ,ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలపై కూడా సమీక్షలు నిర్వహించారు.

ఈ సమావేశంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, సీవీఎస్వో కె.వి. మురళీ కృష్ణ, ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *