హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు

Spread the love

వెల్ల‌డించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్

తిరుప‌తి : తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టిటిడి ఈవో మాట్లాడారు. ఆన్ లైన్ నమోదు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయా, ఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు.

శ్రీపద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి అందిస్తున్న వైద్యసేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ ఎన్. శ్రీనాథ్ రెడ్డి టిటిడి ఈవోకు వివరించారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. అనంతరం ఐసియూ – 1లోని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు ఉన్న రంద్రాలను సరిచేసే క్యాత్ ల్యాబ్ మిషన్ ను, ఐసియూ -2లోని ఐసోలేషన్ గదిని, ఐసియూ – 3, జనరల్ వార్డులలో చికిత్స పొందిన చిన్నారులను పరిశీలించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలం అందిస్తున్న సేవలను పిల్లల సంరక్షకులతో మాట్లాడారు. కడపకు చెందిన 3 నెలల చిన్నారి కిషోర్ కు మంచి రక్తం, చెడు రక్తం గుండెలో వేర్వేరుగా వెళ్లాల్సి ఉండగా, ఒకేచోట కలుస్తుండడంతో శస్త్ర చికిత్స చేసి మంచి రక్తం, చెడు రక్తం వేర్వేరుగా వెళ్లేలా వైద్యం చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీఈ టి వి సత్యనారాయణ, ఎస్ఈ వేంకటేశ్వర్లు, మనోహరం, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్.ఎం.వో డా.భరత్, వైద్యులు, తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు
వెల్ల‌డించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్

తిరుప‌తి : తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టిటిడి ఈవో మాట్లాడారు. ఆన్ లైన్ నమోదు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయా, ఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు.

శ్రీపద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి అందిస్తున్న వైద్యసేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ ఎన్. శ్రీనాథ్ రెడ్డి టిటిడి ఈవోకు వివరించారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. అనంతరం ఐసియూ – 1లోని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు ఉన్న రంద్రాలను సరిచేసే క్యాత్ ల్యాబ్ మిషన్ ను, ఐసియూ -2లోని ఐసోలేషన్ గదిని, ఐసియూ – 3, జనరల్ వార్డులలో చికిత్స పొందిన చిన్నారులను పరిశీలించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలం అందిస్తున్న సేవలను పిల్లల సంరక్షకులతో మాట్లాడారు. కడపకు చెందిన 3 నెలల చిన్నారి కిషోర్ కు మంచి రక్తం, చెడు రక్తం గుండెలో వేర్వేరుగా వెళ్లాల్సి ఉండగా, ఒకేచోట కలుస్తుండడంతో శస్త్ర చికిత్స చేసి మంచి రక్తం, చెడు రక్తం వేర్వేరుగా వెళ్లేలా వైద్యం చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీఈ టి వి సత్యనారాయణ, ఎస్ఈ వేంకటేశ్వర్లు, మనోహరం, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్.ఎం.వో డా.భరత్, వైద్యులు, తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

    Spread the love

    Spread the loveతండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. ప్ర‌తి రోజూ 80 వేల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లి…

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *