అద్వానీ ఎందరికో స్పూర్తి
ప్రశంసించిన జగ్గీ వాసుదేవన్
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం భారత రత్నను మాజీ ఉప ప్రధాన మంత్రి లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించడం పట్ల ప్రముఖ ఆధ్యాత్మక గురువు జగ్గీ వాసుదేవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన స్వయంగా ఎల్ కే అద్వానీ నివాసానికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
జీవితాంతం విలువలకు కట్టుబడిన నేతగా అభివర్ణించారు. భారత రత్న పురస్కారం దక్కడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డుకు అద్వానీ అర్హుడేనని స్పష్టం చేశారు జగ్గీ వాసు దేవన్. భారత దేశానికి ఆభరణం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పురస్కారం భారత రత్న అని పేర్కొన్నారు.
లాల్ కృష్ణ అద్వానీ సాగించిన రథ యాత్ర దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందుని అన్నారు జగ్గీ వాసు దేవన్. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని ప్రశంసల జల్లు కురిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు సద్గురు.
ఈ సందర్బంగా అత్యున్నత అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత దేశ ప్రథమ పౌరురాలు , రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీకి, ఎంపిక కమిటీకి ధన్యవాదాలు తెలిపారు జగ్గీ వాసుదేవన్.