సీనియర్ జర్నలిస్ట్ ల పెన్షన్ కోసం కృషి చేస్తా

Spread the love

వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు ఎంపీ భరోసా !

తిరుప‌తి : తిరుప‌తి ఎంపీ గురుమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ను గుర్తించాల‌ని కోరారు. దేశ వ్యాప్తంగా వెటరన్ జర్నలిస్ట్ లకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు కృషి చేస్తా నని డా.మద్దెల గురుమూర్తి హామీ ఇచ్చారు. శనివారం తిరుపతి లో ఆయన కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు డా. టి.జనార్దన్, ఏపీ వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యం.నరేంద్ర రెడ్డి, ఆర్.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు పి. వి. రవికుమార్ లు కలసి ఎంపీకి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు సీనియర్ జర్నలిస్ట్ లకు పెన్షన్ అందజేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.

గత సంవత్సరం ఆగష్టులో కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్స్ ప్రథమ జాతీయ మహా సభలో వెటరన్స్ కు సామాజిక భద్రత క్రింద ఆదుకోవాలని దానికై జాతీయ సమగ్ర పెన్షన్ విధానం అమలు చేస్తూ నెలకు కనీసం రూ. 25 వేలు మంజూరు చేయాలని తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. కరోనా సమయంలో రద్దు చేసిన రైల్వే పాసులు పునరుద్దరించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సత్వరం గతంలో లాగా రాయితీ పాసులు అందజేయాలని కోరారు. అలాగే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వర్తింప చేసి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్ట్ లను ఆదుకొనేందకు మీడియా కమిషన్ ఏర్పాటు చేసి వేజ్ బోర్డు సిపార్సులు పటిష్టం గా అమలు కు కృషి చేయాలని తెలిపారు. ఈ డిమాండ్స్ పట్ల ఎంపీ సానుకూలంగా స్పందించి రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో జర్నలిస్ట్ ల సమస్యలు సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

  • Related Posts

    తాజా ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే విజ‌యం

    Spread the love

    Spread the loveధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇండియా కూట‌మి త‌ర‌పున పెద్ద ఎత్తున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇండియా కూట‌మిలోని…

    ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్ర‌తినిధులు భేటీ

    Spread the love

    Spread the loveరూ. 200 కోట్ల‌తో అమ‌రావ‌తిలో క్యాంప‌స్ నిర్మాణం అమ‌రావ‌తి : భార‌త దేశంలో విద్యా ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంప‌స్, యూనివ‌ర్శిటీ. ఈ సంద‌ర్బంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా బిట్స్ పిలానీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *