తెలంగాణ స‌ర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Spread the love

పిటిష‌న్ కు విచార‌ణ అర్హ‌త లేద‌న్న ధ‌ర్మాస‌నం

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది తెలంగాణ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై. పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువ‌రించింది ధ‌ర్మాస‌నం. ఈ సంద‌ర్బంగా బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ సీరియ‌స్ గా వ్యాఖ్యానించింది. అయితే పిటిష‌న్ దాఖ‌లు చేసే ముందు ముందూ వెనుకా ఆలోచించ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని పేర్కొంది. చివ‌ర‌కు పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది సింఘ్వీ చేసిన వినతి మేర‌కు ఇత‌ర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చేందుకు ఓకే చెప్పింది.

ధ‌ర్మాస‌నం చేసిన వ్యాఖ్య‌ల‌తో తాము పిటిషన్ ఉపసంహరించు కుంటున్నామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. దీంతో రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వాదనలు కూడా వినాల్సి ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

  • Related Posts

    డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ బ‌లిదానం బాధాక‌రం

    Spread the love

    Spread the loveమాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్ ఆవేద‌న హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ శంకర్ గౌడ్ బలిదానం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్. ఆయ‌న ఇవాళ కీల‌క…

    గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం

    Spread the love

    Spread the loveబీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గంగపుత్ర , బెస్త, గూండ్ల కులస్తులకు బిసి స్థితిగతుల అధ్యయనం కోసం జరిగే జన గణలో వారికి తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర వెనుకబడిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *