సూదిని జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి

దివ్యాంగుల‌కు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త పాల‌మూరు జిల్లాకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా దివ్యాంగుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. స‌మాజ అభివృద్దిలో మీరు కూడా కీల‌క‌మైన భాగ‌స్వాములేన‌ని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ముఖ్య‌మంత్రి. ట్రాన్స్ జెండ‌ర్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని నామినేట్ చేయాలని సూచిస్తున్నాన‌ని చెప్పారు.

వారి సమస్యల పరిష్కారం కోసం వాళ్లే గళం విప్పేలా వారికీ రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. వయోవృద్ధులు మన ప్రభుత్వ కుటుంబ సభ్యులేన‌ని అన్నారు. వారి సంక్షేమం కోసం “ప్రణామ్” పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం అని వెల్ల‌డించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం నేరుగా తల్లిదండ్రులకు అందించేలా చట్టం తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని చెప్పారు. పుట్టుక‌తో విక‌లాంగుడైన‌ప్ప‌టికీ ఎంతో క‌ష్ట‌ప‌డి భార‌త దేశం గ‌ర్వించేలా ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *