ప‌వ‌ర్ స్టార్ తో పీపుల్స్ మీడియా మ‌రో చిత్రం

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన నిర్మాత విశ్వ ప్ర‌సాద్

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ వేళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ప్ర‌ముఖ నిర్మాత‌, పీపుల్స్ మీడియా సంస్థ చీఫ్ టీజీ విశ్వ ప్ర‌సాద్. బుధ‌వారం ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. సినిమా రంగానికి సంబంధించి ప‌లు అంశాలు చ‌ర్చించారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి గంట‌కు పైగా స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పీపుల్స్ మీడియా ప‌లు సినిమాల‌ను నిర్మిస్తోంది. నిర్మాత‌కు అమెరికాలో ఐటీ కంపెనీ ఉంది. కానీ ఆయ‌న‌కు సినిమాలంటే పిచ్చి ప్రేమ‌. అదే త‌న‌ను నిర్మాత‌గా మారేలా చేసింది. హ‌రీష్ శంక‌ర్ తో క‌లిసి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తీసిన మూవీ ఆశించిన మేర ఆడ‌లేదు. ఇదే స‌మ‌యంలో భారీ బ‌డ్జెట్ తో ప్ర‌భాస్ తో క‌లిసి తీసిన రాజా సాబ్ వ‌ర్క‌వుట్ కాలేదు.

ఇదే స‌మ‌యంలో టీజీ విశ్వ ప్ర‌సాద్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గ‌తంలో ఓజీ మూవీ తీశారు. అది బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. తాజాగా నిర్మాత ఓ మీడియాతో మాట్లాడారు. తాను ఫెయిల్ , స‌క్సెస్ గురించి ఆలోచించ‌నని అన్నారు. త‌న‌కు లెక్క‌కు మించిన ఆదాయం వ‌స్తుంద‌ని, త‌న‌కు భారీ ఎత్తున కంపెనీ ఉంద‌న్నారు. త‌న‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయ‌నే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు టీజీ విశ్వ ప్ర‌సాద్. పీపుల్స్ మీడియాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌న్నారు . త్వ‌ర‌లోనే మ‌రో కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పారు నిర్మాత‌.

  • Related Posts

    మెగా యూత్ ఫోర్స్ క‌న్వీన‌ర్ గా ఏడిద బాబి

    Spread the love

    Spread the loveనియ‌మించిన మెగాస్టార్ కూతురు సుష్మిత హైద‌రాబాద్ : మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిద‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్…

    దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

    Spread the love

    Spread the loveఇదంతా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌వ‌ల్లే సాధ్యం ముంబై : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన దురంధ‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్ర‌త్యేకించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *