సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

నారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్

తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, కొడుకు నారా లోకేష్ , మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ తో పాటు కుటుంబీకులు సంద‌డి చేశారు. ప్ర‌తి పండుగ‌కు త‌న స్వంత ఊరులో సంద‌డి చేస్తారు. సీఎం రాక సంద‌ర్బంగా పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఈ స‌ద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నారా వారి పల్లెకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం దంప‌తుల‌కు ఆ క‌లియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి తీర్థ ప్ర‌సాదాల‌తో పాటు చిత్ర ప‌టాన్ని అంద‌జేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, వేద పండితులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *