కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కార్ పై షాకింగ్ కామెంట్స్
చెన్నై : ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. తను చేసిన తాజా కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఈ దేశంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ సందర్బంగా అల్లా రఖా రెహమన్ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నాడు. గతంలో పెద్ద ఎత్తున తనకు సినిమా అవకాశాలు సంగీత పరంగా వచ్చేవని చెప్పాడు. కానీ ఈ మధ్యన అలాంటి ఛాన్సులు తనకు దక్కడం లేదంటూ వాపోయాడు.
గతంలో ఎన్నడూ రెహమాన్ ఇలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఇవాళ తను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నది ప్రకటించాడు. నా ముస్లిం గుర్తింపు కారణంగా నాకు పని దొరకడం లేదంటూ బాంబు పేల్చాడు. వాస్తవానికి రెహమన్ పుట్టుకతో ముస్లిం కాదు. ఆయన హిందువు. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. ముస్లిం మతం స్వీకరించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీకి సంగీతం అందించాడు. ఇందులోని పాటలు టాప్ లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెహమాన్ ఏకంగా మోదీ సర్కార్ ను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది.






