వ‌న‌ దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Spread the love

మొక్కులు చెల్లించుకున్న రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి

వ‌రంగ‌ల్ జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద జాత‌ర మేడారం జ‌న‌సంద్రంగా మారింది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్నారు. త‌మ మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని పూజ‌లు చేశారు రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.
మహా గిరిజన జాతర ఏర్పాట్లు, అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాలపై ఆర్‌, ‌బి అధికారులతో సమీక్ష నిర్వహించారు అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం.

సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరను భక్తి, శ్రద్ధలతో నిర్వహించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఈ సంద‌ర్బంగా చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ
శుభాకాంక్షలు తెలిపారు. గోండు ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత, సామూహిక జీవన విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని చాటుతోందన్నారు.

  • Related Posts

    తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

    Spread the love

    Spread the loveతండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. ప్ర‌తి రోజూ 80 వేల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లి…

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *