మిరాయ్ బిగ్ స‌క్సెస్ తేజ స‌జ్జా ఖుష్

న‌టుడు, ద‌ర్శ‌కుడు కీల‌క వ్యాఖ్య‌లు

త‌ను న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిరాయ్ చిత్రం ఎట్ట‌కేల‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. హ‌నుమాన్ కంటే మిరాయ్ సినిమా కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డామ‌ని, ఆ ఫ‌లితం ఇప్పుడు క‌నిపిస్తోంద‌ని అన్నాడు న‌టుడు, ద‌ర్శ‌కుడు. మూవీని అద్భుతంగా ఆద‌రిస్తుండ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఒక త‌ల్లి కోసం ప‌డే త‌ప‌న‌, జ‌ర్నీనే ఇందులో చూపించ‌డం జ‌రిగింద‌న్నాడు. తన విధిని, పురాతన యోధులతో తనకున్న బంధాన్ని, ఒక గొప్ప ప్రమాదాన్ని ఆపడానికి ఎంత దూరం వెళ్ళగలడో తెలుసుకునే సాధారణ యువకుడి పాత్రను పోషించాన‌ని చెప్పాడు తేజ స‌జ్జా.

మిరాయ్ లో తొమ్మిదికి పైగా యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉన్నాయ‌ని, ఇవి ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఉత్సుక‌త క‌లిగించేలా చేస్తాయ‌ని అన్నాడు. చాలా రిస్క్ తీసుకుని తీశామ‌న్నాడు. చూసిన ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ కు గురి కావాలని అదే తాను కోరుకుంటాన‌ని తెలిపాడు తేజ సజ్జా. ఇందులో ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది శ్రియ శ‌ర‌ణ్, జ‌గ‌ప‌తి బాబుతో క‌లిసి ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. తాను బాల న‌టుడిగా వారితో క‌లిసి న‌టించాను. తిరిగి వారితో మూవీ చేయ‌డం త‌న‌కు చెప్ప‌లేని సంతోషం క‌లిగించింద‌ని చెప్పాడు న‌టుడు, ద‌ర్శ‌కుడు. మిరాయ్ ని హిమాలయాలు, నేపాల్, శ్రీలంక, మైనస్ 8°C ఉష్ణోగ్రతలలో కూడా వారి అంకితభావం నాకు స్ఫూర్తిని ఇచ్చేలా చేసింద‌న్నాడు. ఇంకొక‌రి గురించి చెప్పాల్సింది ఉంది. త‌ను ఎవ‌రో కాదు మంచు మ‌నోజ్ కీల‌క‌మైన రోల్ చేశాడు. ఇది సినిమాకు ప్ల‌స్ పాయింట్ గా నిలిచింద‌న్నాడు.

  • Related Posts

    సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

    ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

    అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

    ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *