క‌ష్ట‌ప‌డి చ‌దివితే స‌క్సెస్ సాధ్యం అవుతుంది

స్ప‌ష్టం చేసిన హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి

అమ‌రావ‌తి : మ‌నిషి జీవితంలో పైకి ఎద‌గాలంటే క‌ష్ట‌ప‌డాల‌ని అన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. స్వ‌చ్చ ఆంధ్ర కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. అనంత‌రం బాలికా దినోత్స‌వం సంద‌ర్బంగా విద్యార్థినుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. చ‌దువు ఒక్క‌టే మన‌ల్ని ఉన్న‌త‌మైన వ్య‌క్తులుగా తీర్చిద‌ద్దుతుంద‌ని చెప్పారు. ఉన్న‌త‌మైన స్థానం చేరుకుంటే స‌మాజం గౌర‌విస్తుంద‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచు కోవాల‌ని సూచించారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం విద్యా రంగంపై ఫోక‌స్ పెట్టింద‌ని అన్నారు. స‌మ‌ర్థ‌వంతుమైన నాయ‌కుడు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాష్ట్రం అన్ని రంగాల‌లో ప‌రుగులు తీస్తోంద‌న్నారు.

ముఖ్య‌మంత్రి దార్శనికత వల్ల స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంద‌ని చెప్పారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వంగ‌ల‌పూడి అనిత‌ పారిశుధ్య కార్మికులను సత్కరించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. కలెక్టర్ విజ‌య‌కృష్ణ‌న్ తో క‌లిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు చెత్త నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి సరఫరా వంటి అంశాలపై ఎరుక క‌లిగి ఉండాల‌న్నారు . జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు వంగ‌లపూడి అనిత‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *