భార‌త రాజ్యాంగం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం

Spread the love

హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌

హైద‌రాబాద్ : భార‌త రాజ్యాంగం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం అని పేర్కొన్నారు హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌. స్వాతంత్య్రం సాధించుకున్నాం. ప్ర‌జాస్వామ్య దేశంగా అవ‌త‌రించాం. స్వేచ్ఛాయుత జీవితాన్ని గ‌డుపుతున్నాం.. మ‌నం అనుభ‌విస్తున్న ప్ర‌జాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి నియ‌మ నియంత్ర‌ణ‌లే భార‌త రాజ్యాంగం అని చెప్పారు. నియ‌మ నియంత్ర‌ణ‌లు లేక‌పోతే ప్ర‌జాస్వామ్యం గాడి త‌ప్పుతుందని అన్నారు వ‌ర్ల పాప‌య్య‌. బాధ్య‌త గ‌ల పౌరుడిగా మ‌నం నిర్వ‌హించాల్సిన విధులు, అనుస‌రించాల్సిన విధానాల‌ను అంద‌రూ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ భార‌త రాజ్యాంగాన్ని చ‌ద‌వాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవనాన్ని అందించాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆ దిశ‌గా ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను హైడ్రా తీర్చిదిద్దుతోంద‌న్నారు అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్. ప్ర‌భుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడుకున్న‌ప్పుడే.. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను నియంత్రించ‌గ‌ల‌మ‌ని వ‌ర్ల పాప‌య్య‌ అన్నారు. పార్కుల‌ను కాపాడి ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణాన్ని, చెరువులు, నాలాలను ర‌క్షించి వ‌ర‌ద‌ల‌ను నియంత్రిస్తున్నామ‌న్నారు. హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్ సుద‌ర్శ‌న్ , ఏసీపీలు తిరుమ‌ల్, ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, రీజ‌న‌ల్ ఫైర్ ఆఫీస‌ర్ జ‌య‌ప్ర‌కాష్‌, డీఎఫ్‌వోలు య‌జ్జ నారాయ‌ణ , శ్రీ గౌత‌మ్ , ఏడీఎఫ్‌వో మోహ‌న్ రావు , హైడ్రా ఇన్‌స్పెక్ట‌ర్లు, ఎస్ ఎఫ్ వోలు ఇత‌ర అధికారులు సిబ్బంది గ‌ణ‌తంత్ర దినోత్స‌వంలో పాల్గొన్నారు.

  • Related Posts

    అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    Spread the love

    Spread the loveశ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది.…

    త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    Spread the love

    Spread the loveమ‌హ‌నీయుడ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *