కవిత కాంగ్రెస్ లోకి వ‌స్తానంటే వ‌ద్ద‌న్నా

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు క‌విత గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. క‌విత తాజాగా త‌న గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ఆమెకు అంత సీన్ లేద‌న్నారు. త‌ను నాకు త‌న పెట్ట‌బోయే పార్టీలో జాతీయ స్థాయిలో ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు మ‌హేష్ కుమార్ గౌడ్. త‌న స్థాయికి మించి మాట్లాడ‌టం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

ఇదే స‌మ‌యంలో టీపీసీసీ చీఫ్ బాంబు పేల్చారు. క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న‌ను సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. త‌ను కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తానంటూ క‌బురు పంపించింద‌ని, అయితే తను రావ‌ద్దంటూ సూచించాన‌ని తెలిపారు. ఇది వంద శాతం వాస్త‌వ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అబ‌ద్దం లేద‌న్నారు. ఒక‌వేళ కాద‌ని అంటే బ‌య‌ట‌కు వ‌చ్చి క‌విత చెప్పాల‌న్నారు మ‌హేష్ కుమార్ గౌడ్. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ప్రతిపాదన ఏఐసీసీలో వచ్చినప్పుడు తాను ఒక్క‌డినే వ్యతిరేకించాన‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రులు సమావేశం అవ్వడంలో తప్పేం లేద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *