పాట‌ల విలుకాడు నిష్క్ర‌మించాడు

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆర్జిత్ సింగ్

ముంబై : ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను ఆశ్చ‌ర్యంలోకి నెట్టేశాడు ప్ర‌ముఖ భార‌తీయ గాయ‌కుడు ఆర్జిత్ సింగ్. త‌ను ఇక పాడ‌లేనంటూ పేర్కొన్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాడు. దీంతో సామాజిక మాధ్య‌మాల‌లో త‌ను ట్రెండింగ్ లో ఉన్నాడు. త‌ను పాడిన ప్ర‌తి పాట బిగ్ హిట్. ఇండియాలోనే కాదు యావ‌త్ ప్ర‌పంచంలో సైతం త‌న‌కు స్పెష‌ల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ పాటైనా అవ‌లీల‌గా పాడేస్తాడు. గుండెను హ‌త్తుకునేలా ఉంటాయి త‌న పాట‌లు. ఇది నిజం కాక పోయి ఉంటే బాగుండేదంటూ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆర్జిత్ సింగ్ ఇక పాడ‌లేనంటూ తెలిపాడు. తీవ్ర భావోద్వేగంతో త‌ను పేర్కొన్నాడు.

అయితే ఎందుకు పాడ‌టం లేద‌నే విష‌యం గురించి క్లారిటీ ఇవ్వ‌లేక పోయాడు. ఇప్ప‌టికే త‌ను టాప్ గాయ‌కుల‌లో ఒక‌డిగా ఉన్నాడు. అరిజిత్ సింగ్ బాలీవుడ్‌లో అత్యంత హృద్యమైన పాటలను అందించారు .వాటిలో ఆషికి 2 నుండి ‘తుమ్ హి హో’ అతని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.
అభిమానులకు ఇష్టమైన ఇతర పాటలలో ఏ దిల్ హై ముష్కిల్ నుండి ‘చన్నా మేరేయా’, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ నుండి ‘ఫిర్ భీ తుమ్కో చాహూంగాస‌, జబ్ హ్యారీ మెట్ సెజల్ నుండి ‘హవాయేన్’ ఉన్నాయి. ఆర్జిత్ సింగ్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు. 2025లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించబడ్డాడు.

  • Related Posts

    వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా

    హైద‌రాబాద్ : అంద‌రూ అనుకున్న‌ట్లే విక్ట‌రీ వెంక‌టేష్ కీ రోల్ పోషించిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆద‌ర్శ కుటుంబం వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సోమ‌వారం ప్ర‌క‌టించారు నిర్మాత నాగ‌వంశీ. వాస్తవానికి అక్టోబ‌ర్ 9వ తేదీన…

    ర‌ష్మిక మంద‌న్నా..దేవుడిచ్చిన వ‌రం : దేవ‌ర‌కొండ

    హైద‌రాబాద్ : యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను త‌న భార్య‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చారిత్రాత్మ‌క‌మైన ర‌ణ‌బాలి మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. గ‌తంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇద్ద‌రూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *