newsseals.com
ENTERTAINMENT

ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు బన్నీ కంగ్రాట్స్

VijayaBhaskar January 27, 2026
newsseals-AlluArjun
Spread the love

మ‌మ్ముట్టి, మాధ‌వ‌న్, ముర‌ళీ మోహ‌న్, జాన‌కి

హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ప్ర‌స్తావించారు. వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు బ‌న్నీ. మమ్ముట్టి, ఆర్. మాధవన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లతో పాటు దివంగత నటుడు ధర్మేంద్ర చేసిన సేవలను ప్రశంసించారు. పద్మ అవార్డుల గ్రహీతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా స్పందించారు. అంతే కాకుండా భారత క్రికెట్‌లో సాధించిన విజయాలకు క్రికెటర్లు రోహిత్ శర్మ , హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. నటులు రాజేంద్ర ప్రసాద్ , మురళీ మోహన్ తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను కూడా ఈ నటుడు హైలైట్ చేశారు.

ఈ ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాన్ని పొందిన పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. పద్మ విభూషణ్ అందుకున్న ధర్మేంద్ర జీకి ప్రత్యేక వందనం. భారతీయ సినిమాకు సాటిలేని సేవ చేసినందుకు పద్మ భూషణ్ అందుకున్న మమ్ముట్టికి ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు కురిపించారు. తమతమ రంగాలలో శ్రేష్ఠత, నాయకత్వం, శాశ్వత ప్రభావాన్ని గుర్తించి పద్మశ్రీ ప్రదానం చేసినందుకు కేంద్ర స‌ర్కార్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు అల్లు అర్జున్. అంతే కాకుండా టాలీవుడ్‌కు దశాబ్దాల పాటు చేసిన విశేష సేవలకు గౌరవంగా రాజేంద్ర ప్రసాద్ , మురళీ మోహన్ పద్మశ్రీ అందుకోవడం తెలుగు సినిమాకు గర్వకారణం అని పేర్కొన్నారు బ‌న్నీ.