సంజూ శాంస‌న్ కు మ‌ద్ద‌తు ఇవ్వాలి : మంజ్రేక‌ర్

త‌ను అద్బుత‌మైన క్రికెట‌రంటూ కితాబు

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పేల‌వ‌మైన ఫామ్ పై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న 5 టి20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇప్ప‌టి దాకా 4 మ్యాచ్ లు ఆడాడు. ఇవాళ కీల‌క‌మైన 5వ మ్యాచ్ ఆడ‌బోతున్నాడు. అది త‌న స్వంత గ్రౌండ్ లో. దీంతో మ‌రింత ఒత్తిడి త‌న‌పై ఉంది. ఇప్ప‌టికే లక్ష‌లాది మంది అభిమానులు త‌ను ఫామ్ లోకి రావాల‌ని కోరుకుంటున్నారు. త‌మ ఇష్ట దైవాల‌ను ప్రార్థిస్తున్నారు. ఈ త‌రుణంలో మాజీ క్రికెట‌ర్లు సైతం త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. కొన్ని మ్యాచ్ లు ఆడ‌లేద‌ని దూరం పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తే త‌న కెరీర్ నాశ‌నం చేసిన వార‌వుతార‌ని పేర్కొన్నారు.

ఈ త‌రుణంలో ప్ర‌ముఖ భార‌త మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ సంజూ శాంస‌న్ ఫామ్ ఫై స్పందించాడు. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న‌ను త‌ప్ప‌కుండా ఆడించాల‌ని సూచించాడు. సంజూ శాంసన్ ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు చేసినప్పుడు తన కెరీర్‌లో అత్యున్నత దశకు చేరుకున్నాడు. కేవలం టెస్ట్ పరుగుల ఆధారంగా అతన్ని ఓపెనింగ్ స్థానం నుండి తప్పించి, టీ20లలో శుభ్‌మన్ గిల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఒక పొరపాటు. ఆ నిర్ణయం సంజూ లయను దెబ్బ తీసిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు సంజ‌య్ మంజ్రేక‌ర్.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *