
ఆనందం వ్యక్తం చేసిన నటి రితికా
హైదరాబాద్ : కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం మిరాయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన దానికంటే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక చిత్రం విషయానికి వస్తే అనిల్ ఆనంద్ సహాయ దర్శకుడిగా పని చేశాడు. మణిబాబు కరణం మాటలు రాశాడు సినిమాకు. ఇందులో ముఖ్య పాత్రలలో తేజ సజ్జా, మనోజ్ కుమార్ మంచు, మహాబీర్ లామా, రితికా నాయక్, జగపతి బాబు, శ్రియా శరణ్, జయరామ్, కౌశిక్ మహతా, పొలపానే శ్రీరామ్ రెడ్డి, తాంజా కెల్లర్, యుకా నటించారు.
సుజిత్ కుమార్ కార్య నిర్వహక నిర్మాతగా వ్యవహరించారు. కృతి ప్రసాద్, టీజీ విశ్వ ప్రసాద్ , గౌతమ్ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు. గౌర హరి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. మిరాయి చిత్రం సక్సెస్ బాట పడుతుండడంతో మూవీ టీఎం కీలక సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా నటీ నటులు తేజ సజ్జా, రితికా నాయక్ ప్రసంగించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిరాయ్ సినిమా ను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు రితికా నాయక్. తనకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. తాను వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
హీరో తేజ సజ్జా మిరాయి బిగ్ సక్సెస్ కావడం పట్ల ఆనందంగా ఉందన్నాడు. హనుమాన్ కంటే మిరాయ్ ని ఆదరిస్తున్నందుకు సంతోషం కలిగించిందని తెలిపాడు. కల్కి వేరు, నరసింహ మహావతార్ ను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సమయంలో తమ సినిమాను కూడా హత్తుకుంటారన్న నమ్మకం నిజమైందన్నారు.