విజ‌య్ కార్తీక్ తో విడి పోతున్నా : కీర్తి భ‌ట్

Spread the love

సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య విడాకుల ప్ర‌క‌ట‌న‌లు ఎక్కువై పోయాయి. ఇక సినీ రంగంలో ఎవ‌రు ఎప్పుడు క‌లిసి ఉంటారో ఎప్పుడు విడి పోతారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇందుకు అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొని ఉండ‌టం, ఆర్థిక స్వేచ్ఛ ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా న‌టి కీర్తి భ‌ట్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. త‌ను సీరియ‌ల్స్ ప‌రంగా మోస్ట్ పాపుల‌ర్ న‌టి. ఇప్ప‌టికే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన సీరియ‌ల్ కార్తీక దీపంలో కీల‌క పాత్ర పోషించింది. ఈ సీరియ‌ల్ ద్వారా ఆమెకు పెద్ద‌గా పేరు వ‌చ్చేలా చేసింది. త‌న‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే గ‌త కొంత కాలంగా త‌ను విజ‌య్ కార్తీక్ తో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చింది. కానీ అంత‌లోనే ఏమైందో ఏమో కానీ ఈ ముద్దుగుమ్మ తాను త‌న కాబోయే భ‌ర్త విజ‌య్ కార్తీక్ తో విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అయితే తాము ఇద్ద‌రం ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చామ‌ని, అందుకే క‌లిసి ఉండ‌టం కంటే విడి పోవడ‌మే మేల‌ని అనుకున్నామ‌ని తెలిపింది కీర్తి భ‌ట్. విచిత్రం ఏమిటంటే ఈ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు , తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు విజయ్ కార్తీక్ తోటతో తన బ్రేకప్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ ద్వారా ఈ వార్తను పంచుకున్నారు. వారిద్దరి మధ్య బంధం నిజమైనదే అయినప్పటికీ, విజయ్ కార్తీక్‌ను జీవిత భాగస్వామిగా ఊహించు కోలేక పోయానని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.

  • Related Posts

    రూ. 300 కోట్లు దాటేసిన స‌న్నీ డియోల్ బోర్డ‌ర్ -2

    Spread the love

    Spread the loveబాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం ముంబై : బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది బోర్డ‌ర్ -2 మొన్న‌టి దాకా ప‌లు సినిమాలు ప‌డుతూ లేస్తూ వ‌చ్చాయి. కానీ ఒక్క‌సారిగా ఆదిత్య ధ‌ర్ తీసిన…

    ఏప్రిల్ 7న రానున్న మ‌హేష్ బాబు వార‌ణాసి

    Spread the love

    Spread the loveప్ర‌పంచ వ్యాప్ంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం వార‌ణాసి. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు ప్రిన్స్ మ‌హేష్ బాబు, న‌టి ప్రియాంక చోప్రా. మ‌రో కీల‌క…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *