కేంద్ర స‌ర్కార్ పై ష‌ర్మిలా రెడ్డి ఫైర్

ఉపాధి హామీ ప‌థ‌కానికి కేంద్రం తూట్లు

అమ‌రావ‌తి : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవలంబిస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పరిరక్షణ యాత్ర అనంత‌పురం జిల్లాలో ముగిసింది. ఇవాళ శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో కొన‌సాగింది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామంలో కరువు పనికొచ్చిన శ్రామికులను కలిసి VB G – RAM G చట్టం ద్వారా జరిగే నష్టాలను వివరించారు ష‌ర్మిలా రెడ్డి. మన్రేగా పథకాన్ని ప్రస్తుత పాలకులు బ్రష్టు పట్టించారని ధ్వ‌జ‌మెత్తారు. 100 రోజుల పనిలో సగం రోజులు కూడా పని కల్పించడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అర్హత కలిగిన పేదల జాబ్ కార్డులు కూడా తొలగించారని శ్రామికులు ష‌ర్మిలా రెడ్డి ఆరోపించారు. మన్రేగా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మరింత బలాన్ని ఇచ్చింద‌ని చెప్పారు. శ్రామికులకు భరోసా ఇచ్చే విధంగా తాను సైతం గునపం పట్టి మట్టి తవ్వడం ఆనందంగా ఉంద‌న్నారు. గ‌త 11 ఏళ్ల మోదీ పాల‌నా కాలంలో భార‌త దేశానికి న‌ష్టం త‌ప్ప ఒరిగింది ఏమీ లేద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *