NEWSNATIONAL

మోదీ ఫెయిల్ పీసీయూలు నిల్

Share it with your family & friends

అత్య‌ధికంగా ఇందిర ఏర్పాటు

న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం మాట‌లు త‌ప్ప చేత‌ల‌లో శూన్యం. కాంగ్రెస్ స‌ర్కార్ హ‌యాంలోనే ఎక్కువ‌గా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ఏర్పాట‌య్యాయి. అయితే ఈ ప‌ది సంవ‌త్స‌రాల బీజేపీ స‌ర్కార్ కాలంలో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా పీసీయూ (ప్ర‌భుత్వ రంగ సంస్థ‌) ను ఏర్పాటు చేయ‌లేక పోయింది.

గ‌త 75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో అత్య‌ధికంగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త దివంగ‌త ప్ర‌ధాన మంత్రి ఇందిరా గాంధీకే ద‌క్కుతుంది. ఆమె హ‌యంలో ఏకంగా 66 పీసీయూల‌ను ఏర్పాటు చేశారు. ఇది ఓ రికార్డు.

ఆ త‌ర్వాత త‌న తండ్రి , దివంగ‌త ప్ర‌ధాన మంత్రి పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ హ‌యాంలో 33 పీసీయూలు కొలువు తీరాయి. డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ పీఎంగా ఉన్న కాలంలో 23 ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు.

అట‌ల్ బిహారీ వాజ్ పేయి కాలంలో 17 పీసీయూలు ఏర్పాటు కాగా దివంగ‌త రాజీవ్ గాంధీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో 17 ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కొలువు తీరాయి. ఇక భార‌త దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడిగా పేరు పొందిన దివంగ‌త తెలుగు తేజం పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు పీఎంగా ఉన్న కాలంలో 14 పీసీయూలు ఏర్పాటు అ

య్యాయి. మొరార్జీ దేశాయ్ హయాంలో 9 ఏర్పాటు కాగా లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి కాలంలో 5, ఐకే గుజ్రాల్ పీఎంగా ఉన్న స‌మ‌యంలో 3, హెచ్ డీ దేవ‌గౌడ కాలంలో 3, విపీ సింగ్ పీఎంగా ఉన్న స‌మ‌యంలో 2 ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ఏర్పాటు చేశారు. కానీ మోదీ ప్ర‌ధానిగా ఉన్న ఈ మొత్తం కాలంలో ఒక్క‌టి కూడా ఏర్పాటు చేయ‌లేదు.