హామీలు ఇవ్వడంలో జగన్..బాబు పోటీ
నిప్పులు చెరిగిన జేడీ లక్ష్మీ నారాయణ
అమరావతి – జై భారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ సీబీఐ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఉచితంగా హామీలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్దతి కాదన్నారు.
ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారని దీనికి బాధ్యత వహించాల్సింది మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉచితాలు ఇచ్చేందుకు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
తమ పార్టీ సిద్దాంతం ఉచితాలకు వ్యతిరేకం అని స్పష్టం చేశారు జేడీ లక్ష్మీ నారాయణ. అభివృద్ది మాత్రమే తమ నినాదమని స్పష్టం చేశారు. ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఇప్పటికప్పుడు ఇంకొన్ని హామీలు ఇవ్వడం ఒక రకంగా ప్రజలను మోసం చేయడం తప్పా మరొకటి కాదన్నారు .
ప్రజలను తీసుకునే వారిగా మార్చడం వల్ల వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు. ఇకనైనా ఆయా పార్టీలు తమ తీరును మార్చుకోవాలని సూచించారు. లేక పోతే ఏదో ఒక రోజు ప్రజలు వ్యతిరేకించే ప్రమాదం లేక పోలేదన్నారు జేడీ లక్ష్మీ నారాయణ.