జగన్ మాట జవదాటను – ఆలీ
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్
అమరావతి – వైసీపీ హైకమాండ్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయమంటే తాను బరిలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు ఆలీ.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ముందు నుంచీ పార్టీ కోసం కష్ట పడ్డానని, ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. కష్టపడిన వారికి తగిన సమయంలో అండగా నిలవడం, వారిని గుర్తించి పదవులు కట్ట బెట్టడం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న మంచి లక్షణం అని కొనియాడారు ఆలీ.
అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణలలో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే దానిపై పెద్ద ఎత్తున చర్చకు రావడం, విస్తృతంగా ప్రచారం జరగడంపై స్పందించక తప్పడం లేదన్నారు. పార్టీ హైకమాండ్ మాటే శిరోధార్యం.
ఒకవేళ సీటు ఇవ్వక పోయినా ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఆలీ. ఇప్పటికే తాను ప్రభుత్వ సలహాదారుగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు నటుడు.