జగన్ పై యుద్ధానికి సిద్ధం
జనసేనాని షాకింగ్ కామెంట్స్
విశాఖపట్నం – జనసేన పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు. జన సైనికులు వీర సైనికుల లాగా పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
విశాఖ పట్టణం , అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను, అరాచకాలను ఎత్తి చూపాలని అన్నారు. అంతే కాదు ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు.
దీని వల్ల ఎంతో కొంత మన వైపు మళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా జనసేన – తెలుగుదేశం కూటమి రాబోయే ఎన్నికల్లో గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రజలు వైసీపీ సర్కార్ ను దించేందుకు, జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగ నంపేందుకు సిద్దమై ఉన్నారని , కేవలం ఎన్నికలు మాత్రమే జరగాల్సిన అవసరం ఉందన్నారు.