NEWSTELANGANA

ఢిల్లీకి రేవంత్..భ‌ట్టి

Share it with your family & friends

పోస్టుల భ‌ర్తీపై క‌స‌ర‌త్తు

హైద‌రాబాద్ – త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రానున్న త‌రుణంలో ఢిల్లీకి బ‌య‌లు దేరి వెళ్ల‌నున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఏఐసీసీ హైక‌మాండ్ తో భేటీ కానున్నారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలోని 17 సీట్ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేసే ప‌నిలో ప‌డింది.

అన్ని సీట్ల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి. కేబినెట్ లో ఇంకొంద‌రికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది. కొన్ని జిల్లాల‌కు ప్రాతినిధ్యం ల‌భించ‌లేదు. ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌ర్వాత 40కి పైగా కార్పొరేష‌న్ల‌కు సంబంధించిన చైర్మ‌న్లు, స‌భ్యులను భ‌ర్తీ చేయాల్సి ఉంది.

ప్ర‌స్తుతానికి ఎన్నిక‌ల ముందు కొన్నింటిని భ‌ర్తీ చేయాల‌ని అనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మ‌న్ గా సిరిసిల్ల రాజ‌య్య‌ను నియ‌మించింది. ఆయ‌న‌తో పాటు రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ గా అజ్మ‌తుల్లాను నియ‌మించారు. ఇంకా 38కి పైగా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు,, స‌భ్యుల‌ను నింపాల్సి ఉంది.