పని చేయండి పదవులు పొందండి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కూటమిగా ఈసారి బరిలోకి రానున్నాయని తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.
జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కష్టపడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఎవరైనా పార్టీ విజయం కోసం కృషి చేస్తారో వారిని తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటానని చెప్పారు పవన్ కళ్యాణ్ .
ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గుర్తించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పదవి దక్కుతుందని హామీ ఇచ్చారు. మన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ది , పార్టీ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్.