పొత్తు పెట్టుకుంటే రాళ్లతో కొట్టండి
ఎంపీ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటోందంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అబద్దమన్నారు. ప్రజలు గులాబీ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఒకవేళ మనం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు కాదు బీజేపీ కార్యకర్తలు మాత్రమే ముందుగా ఓడిస్తారంటూ హెచ్చరించారు బండి సంజయ్ కుమార్ పటేల్. అలా చేస్తే మీ చెప్పులను తమ నేతలకు చూపించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు గురించి ఎవరైనా , ఏ నాయకుడైనా మాట్లాడితే వారిని చెప్పుతో కొట్టాలని అన్నారు.
బీజేపీ లక్ష్యం ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లకు పైగా సాధించడం అని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. 143 కోట్ల మంది ప్రజలు పూర్తిగా బీజేపీని గెలిపించాలని డిసైడ్ అయ్యారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సుస్థిరమైన, సుపారిపాలన అందించే సత్తా ఒక్క బీజేపికి మాత్రమే ఉందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.