మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలో కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను క‌లుసుకున్నారు. అనంత‌రం రేవంత్ రెడ్డి నేరుగా గురువారం ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు ఈ ఇద్ద‌రు. రాష్ట్రంలో ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం పై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మామునూరు ప్రతిపాదిత విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి అయ్యింద‌న్నారు. కావున వెంటనే పనులు చేపట్టాలని కోరారు కేంద్ర మంత్రిని.

కొత్తగూడెం ప్రతిపాదిత విమానాశ్రయానికి పాల్వంచలో స్థలం గుర్తించామని, OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్గాం ప్రతిపాదిత విమానాశ్రయానికి ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్ప‌ష్టం చేశారు. వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు. ఈ భేటీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *