26న కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం
ప్రకటించిన మాజీ చీఫ్ రఘువీరా రెడ్డి
అనంతపురం జిల్లా – ఏపీ పీసీసీ మాజీ చీఫ్ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగుతుండడంతో తమ పార్టీ యుద్ధానికి సిద్దమైందన్నారు. ఈ మేరకు ఈనెల 26న ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 26న అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఇది ఎన్నికల శంఖారావానికి నాంది పలుకుతుందన్నారు. దేశ, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెంచటానికి సంబంధించిన అంశాలతొ వారు ఒక గొప్ప ప్రకటన చేయ బోతున్నట్లు స్పష్టం చేశారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.. ఈ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాను రాను జనాదరణ పెరుగుతోందన్నారు. విచిత్రం ఏమిటంటే జనం ఇప్పుడు ఎవరినీ నమ్మడం లేదన్నారు. వైసీపీ, జనసేన, టీడీపీలలో ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్లేనని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.