హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి

తొండ‌మాన్ పురం ఆలయంలో బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : తొండమాన్‌పురం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జ‌రుగ‌నున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారు హంస వాహనంపై ఊరేగారు.

బుధ‌వారం స్వామి వారు సింహ వాహనంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. 19న హనుమంత వాహనం, 20న సాయంత్రం 5 గంట‌ల‌కు కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభ‌వంగా సాగనున్నాయి. ఫిబ్ర‌వ‌రి 21న గజవాహనం, 22న చంద్రప్రభ వాహనం, 23న ఉదయం తిరుచ్చి, రాత్రి అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. 24న ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఫిబ్ర‌వ‌రి 25న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

  • Related Posts

    వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

    అమ‌రావ‌తి : అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పరిశీలించారు. 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం,…

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *