రేడియేష‌న్ టెక్నాల‌జీ ద్వారా రోడ్ల మ‌ర‌మ్మ‌త్తులు

Spread the love

ప్ర‌శంసించిన టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ : బెజ‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్‌హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ మిషన్ ద్వారా నగరంలోని ఎక్కడైనా గుంతలు ఏర్పడితే, కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బందితోనే అతి తక్కువ సమయంలో గోతులను పూడ్చవచ్చని, ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేకుండా రోడ్ల మరమ్మత్తులు చేయవచ్చని వివరించారు.

ఈ విధానం పూర్తిగా నూతనమైన మార్పులకు నిదర్శనమని, గ్రీన్ టెక్నాలజీ ద్వారా నగరాల్లో కాలుష్యాన్ని నియంత్రించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇలాంటి ఆధునిక యంత్రాలు మరిన్ని వీఎంసీకి రాబోతున్నాయని, భవిష్యత్తులో విజయవాడలో చిన్న గుంత పడినా 15 నిమిషాల్లోనే మరమ్మత్తు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు దేవినేని అప‌ర్ణ‌, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మ‌నేని ప్రసాద్, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ (ప్రాజెక్ట్) డాక్ట‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్, చీఫ్ ఇంజ‌నీర్ ఇంచార్జ్ పి.స‌త్య‌కుమారి, సూప‌రిండెంటింగ్ ఇంజ‌నీర్ (వ‌ర్క్స్) వి.చంద్ర‌శేఖ‌ర్, ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ జి.సామ్రాజ్యం, డిప్యూటీ ఇంజ‌నీర్లు, అసిస్టెంట్ ఇంజ‌నీర్లు ల‌తో పాటు ఎన్.డి.యే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *