ప్ర‌జ‌ల కోణంలో పార్టీని న‌డుపుతాం : క‌విత

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ ఎమ్మెల్సీ

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం హైద‌రాబాద్ లోని తెలంగాణ జాగృతి సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కవిత మీడియాతో మాట్లాడారు. వ‌చ్చే మే నెల‌లో పార్టీని ప్ర‌క‌టిస్తామ‌ని, మంచి ముహూర్తం కోసం ఇంత కాలం ఆగాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్ర‌ముఖులు త‌న‌తో ట‌చ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. సంద‌ర్బం వ‌చ్చిన‌ప్పుడు ఈ విష‌యం తెలియ చేస్తాన‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌ను ఎక్క‌డా ఫెయిల్యూర్ కాలేద‌న్నారు. ఆమె జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షురాలు అని ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. పార్టీ లు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరంటూ ప్ర‌శ్నించారు. కేవ‌లం ఆడ‌వాళ్ల ను ల‌క్ష్యంగా చేసుకుని నిల‌దీయ‌డం ప‌రిపాటిగా పారిందంటూ మండిప‌డ్డారు. తెలంగాణ మా పార్టీ మదర్ బోర్డ్ అని, సామాజిక తెలంగాణ మా పార్టీ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌జ‌ల కోణంలో పార్టీని న‌డిపిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *