మీ సేవ మొబైల్ యాప్ లో టీఎస్ఆర్టీసీ సేవ‌లు

అందు బాటులోకి తీసుకు వ‌చ్చిన సంస్థ

హైద‌రాబాద్ : ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది టీఎస్ఆర్టీసీ. తాజాగా ‘మీ సేవ’ మొబైల్ ఆప్ లో TGSRTC బస్ టిక్కెట్ పొందే సౌకర్యం క‌ల్పించింది. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు, తెలంగాణ ఆర్టీసీ వీసీ , ఎండీ వై.నాగిరెడ్డి గారు, మీసేవ కమీషనర్ రవికిరణ్ తో కలిసి మీ మొబైల్ ఆప్ ను ఆవిష్కరించారు. ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ OPRS సేవలను కూడా అనుసంధానిస్తుంది. ప్రయాణీకులు సుదూర ప్రయాణాలు, ఇంటర్ సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది . మొత్తం OPRS సేవలు 1,710 కాగా, ఏసీ సేవ‌లు 450, నాన్ ఏసీ సేవ‌లు 1260 , రోజూ వారీ బుకింగ్ అయ్యే సీట్లు 13,000 క‌ల్పించంది. ఇందులో ప్ర‌ధాన నగ‌రాల‌ను కూడా ఎంపిక చేసింది. వీటిలో బెంగ‌ళూరు, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం , విజ‌య‌వాడ‌, మంచిర్యాల‌, ఖ‌మ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , వ‌రంగ‌ల్ ఉన్నాయి.

అంతే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఐదు రకాల బస్ పాస్‌లు పొందే సౌకర్యం కూడా క‌ల్పించింది. మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ఐదు కేటగిరీల సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉన్నాయి . సిటీ ఆర్డినరీ పాస్ రూ. 400/నెల (సగటు నెలవారీ అమ్మకాలు: 8,000), మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1,600/నెల (సగటు నెలవారీ అమ్మకాలు: 46,500) , మెట్రో డీలక్స్ పాస్ రూ. 1,800/నెల (సగటు నెలవారీ అమ్మకాలు 12,000), గ్రీన్ మెట్రో లగ్జరీ A/C నెలవారీ పాస్ అమ్మకాలు( 100) 2,200/నెల సగటున నెలవారీగా ఉన్నాయి. పుష్పక్ A/C పాస్ రూ. 5,000/నెల (సగటు నెలవారీ అమ్మకాలు: 450) వీటితో పాటు T24 టికెట్ (జంట నగరాలు) కూడా చేర్చింది. T24 టికెట్ అనేది 24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్, ఇది యాక్టివేషన్ సమయం నుండి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులలో అపరిమిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది. రోజువారీ సగటు అమ్మకాలు 16,830 టిక్కెట్లు కానున్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *