మ‌హిళ‌ల జోలికి వ‌స్తే తాట తీస్తం : అనిత

Spread the love

నిప్పులు చెరిగిన హోం శాఖ మంత్రి

అమ‌రావ‌తి : రాష్ట్రంలో మ‌హిళ‌లు, చిన్నారుల భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాస‌న మండ‌లిలో లా అండ్ ఆర్డ‌ర్ పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు ఎమ్మెల్యేలు. ఈ సంద‌ర్బంగా స్పందించారు మంత్రి. మ‌హిళ‌లు, చిన్నారులు, బాలిక‌లపై ఎవ‌రైనా స‌రే అత్యాచారానికి పాల్ప‌డినా, లేదా ప్ర‌య‌త్నం చేసినా తాట తీస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రభుత్వం వచ్చేసరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి గంజాయి వెళ్ళిందని, ఇప్పుడు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకు వచ్చి గంజాయి వద్దు బ్రో- డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.

ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్,గంజాయి కు హాబ్ అని, ఈరోజు గంజాయిని ఎలా అరికట్టాలో ఆంధ్రప్రదేశ్ ను చూసి నేర్చుకునే పరిస్థితి ఉంద‌ని చెప్పారు. అందరినీ వెతుకుతున్నామ‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఆఖరికి డోర్ డెలివరీ చేసిన వారి కుటుంబ సభ్యులకు పై కూడా దృష్టి పెట్టామన్నారు. 24 గంటల నుండి 48 గంటల లోపు ఏ నిందితునైన పట్టుకొని అరెస్టు చేస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు.

  • Related Posts

    ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధం లేదు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న తమ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న హెరిటేజ్ సంస్థ‌పై అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్న‌రంటూ ఆరోపించారు. ఇది మంచి…

    మీ సేవ మొబైల్ యాప్ లో టీఎస్ఆర్టీసీ సేవ‌లు

    Spread the love

    Spread the loveఅందు బాటులోకి తీసుకు వ‌చ్చిన సంస్థ హైద‌రాబాద్ : ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది టీఎస్ఆర్టీసీ. తాజాగా ‘మీ సేవ’ మొబైల్ ఆప్ లో TGSRTC బస్ టిక్కెట్ పొందే సౌకర్యం క‌ల్పించింది. సచివాలయంలో రవాణా శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *