పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం : సీఎం

శాస‌న స‌భ‌లో నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌న్నారు. ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచు కుంటున్నాం అన్నారు. ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి 2014-19లో రూ.68 వేల కోట్లు సాగునీటిపై వ్యయం చేశామ‌ని చెప్పారు. గడచిన 20 నెలలుగా రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చు చేయగలిగామ‌ని పేర్కొన్నారు సీఎం. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామ‌న్నారు. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందన్నారు.

వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామ‌ని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా మార్కాపురం, ఒంగోలు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామ‌ని పేర్కొన్నారు. 30 ఏళ్ల ముందు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి.. మొదటి దశను ఈ ఏడాది జూలైలోనే పూర్తి చేసి నీళ్లు ఇస్తామ‌ని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2500 కోట్ల మేర ఇంకా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రూ.456 కోట్లతో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశామ‌ని చెప్పారు. క్రెడిట్ చోరీ చేసే అంశం ఆ పార్టీదేన‌ని పేర్కొన్నారు. వెలిగొండకు నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారంటూ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఉద్దేశించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం. కుప్పంలోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో పోశారని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *