మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఖుష్ క‌బ‌ర్

రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇస్తాం

హైద‌రాబాద్ : రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే వ‌న్నాడ ప్ర‌కాశ్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. అక్కడ నష్టపోతున్న వారందరికీ రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తామ‌ని చెప్పారు. గురువారం ఆయ‌న బాధితుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు . తాను మీకు అండ‌గా ఉంటాన‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 450 ఫ్లాట్స్ వాసులకు తీర‌ని న‌ష్టం జ‌రుగుతుంది. దీంతో బాధితుల ఆందోళ‌న‌ను , ఆవేద‌న‌ను అర్థం చేసుకున్నారు ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్. న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో (Same SFT) వేరే సురక్షితమైన గెటెడ్ కమ్యూనిటీలో ‘Ready to Occupy’ ఫ్లాట్లను కేటాయించడం జరుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లిస్తామ‌న్నారు.

కాగా ఇదే తరహాలో నష్టపోతున్న కిస్మత్ పూర్, ఇతర మూసీ ప్రాంతాలు, ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇలాగే నష్ట పరిహారం చెల్లిస్తారా లేదా అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *