చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత‌

అమ‌రావ‌తి : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ‌ను కావాల‌ని నాశ‌నం చేశాడంటూ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా జగన్ గాని, ఆయన పార్టీ నేతలు పట్టించు కోవడం లేదని మంత్రి సవిత మండిపడ్డారు. వైసీపీ అయిదేళ్ల కాలంలో జరగని అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రావాలని, పద్ధతిగా మీకు రావాల్సిన సమయం కేటాయిస్తామని చెప్పినా వైసీపీ నేతలు శాసనసభకు రావటం

లేదన్నారు. శాసన మండలికి వస్తున్నా సభ జరగనీయకుండా, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎస్. స‌విత‌. ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా, భయపడి సభ నుంచి పారిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి మండిపడ్డారు. 2026-27 నూతన బడ్జెట్ లో బీసీలకు అధిక ప్రాధాన్యం కలిగించేలా కేటాయింపులు చేశారన్నారు. తమది బీసీల పక్షపాత ప్రభుత్వమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్ర‌జ‌లు 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా జ‌గ‌న్ రెడ్డికి, ఆయ‌న ప‌రివారానికి బుద్ది రాలేద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *