ఇషాన్ కిష‌న్ గ‌ర్ల్ ఫ్రెండ్ వైర‌ల్

Spread the love

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో

అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుతం చేసింది. స‌మిష్టి కృషితో స‌త్తా చాటింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుమ్ము రేపింది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఆదివారం కోట్లాది మంది అభిమానులు దేశ వ్యాప్తంగా సంబురాల‌లో మునిగి పోయారు. మువ్వొన్నెల ప‌తాకాలు రెప రెప లాడాయి. ఇండియాకు చెందిన వివిధ పార్టీల నేత‌లు, సినీ, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అంద‌రూ అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియానికి క్యూ క‌ట్టారు. ఈసారి రికార్డు స్థాయిలో ఫైన‌ల్ మ్యాచ్ ను వీక్షించారు. స్ట్రీమింగ్ లో స‌రికొత్త రికార్డును సృష్టించింది రిల‌య‌న్స్ జియో హాట్ స్టార్.

ఇక మ్యాచ్ విష‌యానికి వస్తే ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కీవీస్ కెప్టెన్ స్నాట‌ర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 255 ర‌న్స్ చేసింది. సంజు శాంస‌న్ 89, అభిషేక్ శ‌ర్మ 52, ఇషాన్ కిష‌న్ 54, శివ‌మ్ దూబే 26 ప‌రుగులు చేశి స‌త్తా చాటారు. అనంత‌రం కీవీస్ భారీ స్కోరును ఛేదించ‌లేక చ‌తికిల‌ప‌డింది. కేవ‌లం 19 ఓవ‌ర్ల‌లోనే 159 ప‌రుగుల‌కు చాప చుట్టేసింది. అక్ష‌ర్ ప‌టేల్ 3 వికెట్లు తీస్తే బుమ్రా 15 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. ఇక ఇషాన్ కిష‌న్ అటు బ్యాటింగ్ లో మెరిశాడు. మైదానంలో కీల‌క‌మైన మూడు క్యాచ్ లు ప‌ట్టాడు. ఈ సంద‌ర్బంగా త‌న ల‌వ‌ర్ కూడా స్టాండ్ లో క‌నిపించింది. వైర‌ల్ గా మారింది.

  • Related Posts

    స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో సౌక‌ర్యాలు క‌ల్పించాలి

    Spread the love

    Spread the loveదిశా నిర్దేశ‌నం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో మౌలిక వ‌స‌తి స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్…

    సంజు శాంస‌న్ మ్యాచ్ విన్న‌ర్ ప్లేయ‌ర్ : గ‌వాస్క‌ర్

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన మాజీ కెప్టెన్ సన్నీ అహ్మ‌దాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను ఆకాశానికి ఎత్తేశాడు. త‌ను భార‌త జ‌ట్టుకు క‌ప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *