వెలుగుమ‌ట్ల బాధితులకు న్యాయం జ‌ర‌గాలి : క‌విత

ఇండ్లను కూలగొట్టారో అక్కడే ఇళ్లు క‌ట్టించి ఇవ్వాలి

ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె రాష్ట్ర స‌ర్కార్ తీసుకున్న అప్ర‌జాస్వామిక చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఖ‌మ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఎక్కడైతే బుల్డోజర్లతో ఇండ్లను కూలగొట్టారో అక్కడే ప్రభుత్వం ఇండ్లను కట్టించి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అన్యాయంగా పేద‌ల ఇళ్లు కూల్చి వేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. బాధితుల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. వారికి సంఘీభావంగా క‌విత నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. ప్ర‌భుత్వం దిగి వ‌చ్చేంత వ‌ర‌కు తాము దీక్ష విర‌మించేది లేద‌న్నారు. దీంతో ఆమెను అర్ద‌రాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇదిలా ఉండ‌గా ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో మంగళవారం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంద‌రినీ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలిపినందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 41 కింద నోటీసులు అందజేశారు. అనంత‌రం స్వంత పూచీ క‌త్తుపై విడుద‌ల చేశారు.

  • Related Posts

    ‘మీ మార్టుల’ ద్వారా స‌రుకుల అమ్మ‌కం

    అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స‌హ‌కార సంస్థ (ఎన్సీసీఎఫ్‌) తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడ‌త‌గా రాష్ట్రంలో 1000కి పైగా మీ మార్టుల‌ను ఏర్పాటు చేయ‌నుంది. అంతే కాకుండా ఆగ‌స్టు 1 నుంచి పైల‌ట్…

    ఏపీలో రేష‌న్ దుకాణాల్లో నాణ్య‌మైన బియ్యం

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్బంగా పేద‌ల‌కు నాణ్య‌మైన బియ్యం అంద‌జేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో పైల‌ట్ ప్రాజెక్టును తొలిసారిగా దేశంలోనే ఏపీలోని కాకినాడ‌లో అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *