NEWSTELANGANA

కేటీఆర్ ద‌మ్ముంటే రాజీనామా చేయ్

Share it with your family & friends

స‌వాల్ విసిరిన ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బ‌ల్మూర్ వెంక‌ట్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏకి పారేశారు. గురువారం ఎమ్మెల్సీ వెంక‌ట్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియో విడుద‌ల చేశారు.

సంస్కారం గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే న‌వ్వు వ‌స్తోంద‌న్నారు. నీ తండ్రి కేసీఆర్ స‌భ సాక్షిగా మాట్లాడిన వెకిలి మాట‌లు స‌భ్య స‌మాజం మొత్తం చూసింది మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశార‌ని కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింద‌న్నారు.

పీసీసీ చీఫ్ గా 60 కంటే ఎక్కువ స్థానాలు వ‌స్తాయ‌ని రేవంత్ రెడ్డి చెప్పార‌ని, ఆ విధంగా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించార‌ని అన్నారు బ‌ల్మూరి వెంక‌ట్. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని అన్నార‌ని మ‌రి ఇప్పుడు ఏమంటారంటూ ప్ర‌శ్నించారు.

మిత్ర పక్షంతో క‌లిపి 65 సీట్లు సాధించామ‌ని, ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు. స‌చివాల‌యంలో అందుబాటులో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారని తెలిపారు. ద‌మ్ముంటే సిరిసిల్ల‌లో రాజీనామా చేయి కేటీఆర్..నువ్వు నేను నిల‌బ‌డ‌దామంటూ స‌వాల్ విసిరారు వెంక‌ట్.