విధుల్లో అల‌స‌త్వం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

Spread the love

హెచ్చ‌రించిన మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌

హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా
ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేప‌ట్టింద‌ని అన్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ . ఎక్కడైనా చిన్నపాటి లోపాలు తలెత్తితే, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విభాగాల మధ్య పక్కా సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఈ ప్రణాళికను రూపొందించింద‌న్నారు. నాన్-కమ్యూనికబుల్ వ్యాధులను ముందుగానే గుర్తించి, మెరుగైన వైద్యం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 542 మండలాల పరిధిలో ఉన్న సుమారు 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో మహిళకు రక్తహీనత (అనీమియా), మధుమేహం, బీపీ, థైరాయిడ్, కాలేయం, కిడ్నీ పనితీరు తదితర 30 రకాల (జనరల్ మరియు ల్యాబ్) ఆరోగ్య పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. తొలి దశలో ప్రతి జిల్లాలోని 5 మండలాల్లో ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని అన్నారు. మౌలిక వసతులు, సిబ్బంది లభ్యత ఆధారంగా రెండో దశలో మిగిలిన అన్ని మండలాలకు దీనిని విస్తరిస్తారని చెప్పారు మంత్రి.

  • Related Posts

    రోడ్ల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి ప్రణాళిక‌లు త‌యారు చేయాల‌ని ఆదేశించారు. ఇవాళ క‌మాండ్ కంట్రోల్ రూమ్ వేదిక‌గా రోడ్లు, భవనాల…

    దీక్ష విర‌మించిన క‌ల్వ‌కుంట్ల క‌విత

    Spread the love

    Spread the loveకాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ ఫైర్ హైద‌రాబాద్ : వెలుగుమ‌ట్ల బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ దీక్ష చేప‌ట్టిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె చేత మాజీ న్యాయ‌మూర్తి ఈశ్వ‌ర‌య్య నిమ్మ‌ర‌సం ఇచ్చి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *