నెట్ ఫ్లిక్స్ రాక‌తో నా క‌ల సాకార‌మైంది : సీఎం

చిన్న‌ప్ప‌టి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి

హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ వినోద రంగ సంస్థ నెట్ ఫ్లిక్స్ హైద‌రాబాద్ రాక‌తో త‌న క‌ల నిజ‌మైంద‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం లో పాల్గొని ప్ర‌సంగించారు. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చ‌చ్చేంత ఇష్టం అని చెప్పారు. నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ ఆర్ ఆర్, అరుంధతి
వంటి అత్యనున్నత సాంకేతిక తో కూడిన సినిమాలు వచ్చాయని ప్ర‌శంసించారు సీఎం. చెన్నై లో ఉన్న సినిమా ను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్ కు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇదే క్రమంలో నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చిందంటే ఇక హాలీవుడ్ వచ్చినట్లేన‌ని అన్నారు.

మా దృష్టి హాలివుడ్ పైననే అని నేను గతం లోనే చెప్పానని అన్నారు రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణ కు మా పూర్తి సహకారం ఉంటుందని ప్ర‌క‌టించారు. ఫోర్త్ సిటీ ని నిర్మిస్తున్నాం .
మీ విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీ లో ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నామ‌ని హామీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీ కి తీసుకు రావాలని కోరారు. ప్రపంచం లో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామ‌ని చెప్పారు. తెలంగాణ లో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు సీఎం.

  • Related Posts

    యాంక‌ర్ అన‌సూయ‌పై బీజేపీ నేత‌ల ఫిర్యాదు

    హైద‌రాబాద్ : జై శ్రీ‌రామ్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు పాల్ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భ‌జ‌రంగ్ ద‌ళ్ , త‌దిత‌ర హిందూ…

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *